సొర చేప

Article in other languages:

సొర చేప
శిలాజ విస్తృతి: Late డెవోనియన్ - Recent
Bull shark  (Carcharhinus leucas)
Bull shark
(Carcharhinus leucas)
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ఏనిమేలియా
Phylum: కార్డేటా
Subphylum: వెర్టిబ్రేటా
తరగతి: Chondrichthyes
ఉపతరగతి: Elasmobranchii
Superorder: సెలకీమార్ఫా
Orders
Carcharhiniformes
Heterodontiformes
Hexanchiformes
Lamniformes
Orectolobiformes
Pristiophoriformes
Squaliformes
Squatiniformes
Symmoriida
Cladoselachiformes
Xenacanthida(Xenacantiformes)
Iniopterygia
Eugeneodontida

సొర చేప (ఆంగ్లం: Shark) ప్రమాదకరమైన చేప జాతికి చెందిన జంతువు. ఇవి సెలకీమార్ఫా (Selachimorpha) సూపర్ క్రమానికి చెందిన పూర్తిగా మృదులాస్థి చేపలు. ఇవి ఐదు నుండి ఏడు మొప్ప రంధ్రాలతో శ్వాసిస్తాయి. సొర చేపలకు రక్షణ కోసం చర్మం మీద డెంటికల్స్ ఉంటాయి. వీటి దవడలకు చాలా వరుసలలో పదునైన దంతాలుంటాయి.[1] సొర చేపలు వివిధ పరిమాణాలలో ఉంటాయి. మరుగుజ్జు సొర (Dwarf lanternshark : Etmopterus perryi) లోతైన సముద్రాలలో నివసించే సొర జాతి చేపలు సుమారు 17 సెం.మీ. పొడవు మాత్రమే ఉంటే; తిమింగళపు సొర (Whale shark) చేపలు 12 మీటర్లు పొడవుంటాయి.

అందరికీ తెలిసిన బుల్ సొర (Carcharhinus leucas) చేపలలో చాలా జాతులుంటాయి. ఇవి సముద్రాలలోను, మంచి నీటిలోను మరియు నదీ డెల్టా ప్రాంతాలలోను నివసిస్తాయి.[2]

ఉపయోగాలు

  • సొర చేప మాంసం గా మంచి బలమైన ఆహారం. అయితే గర్భిణీ స్త్రీలు దీనిని తినకూడదని ఆంక్షలు విధిస్తారు.
  • సొర చేప చర్మాన్ని దానికున్న డెంటికల్స్ మూలంగా సాండ్ పేపర్ వలె ఉపయోగిస్తారు.

మూలాలు

  1. Budker, Paul (1971). The Life of Sharks. London: Weidenfeld and Nicolson. SBN 297003070. 
  2. Allen, Thomas B. (1999). The Shark Almanac. New York: The Lyons Press. ISBN 1-55821-582-4. OCLC 39627633. 
"http://te.wikipedia.org/wiki/%E0%B0%B8%E0%B1%8A%E0%B0%B0_%E0%B0%9A%E0%B1%87%E0%B0%AA" నుండి వెలికితీశారు

Questions for article: గర్భిణీ స్త్రీలకు, చేపలు

This article is from Wikipedia. All text is available under the terms of the GNU Free Documentation License.


IHS Europe: Infrared Heating Systems for Home and Business.